బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ అనే జర్నల్‌లో ఈ మేరకు నివేదికను ప్రచురించారు. నిద్రలేమి.. మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో కరోనా వైరస్ సులువుగా ప్రవేశించే అవకాశముందట. దాంతోపాటు తీవ్రమైన జబ్బులు, వాటి నుంచి కోలుకోవడానికి దీర్ఘకాలం సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన కోసం ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అందిస్తూ కరోనా బారిన పడిన హెల్త్‌కేర్ వర్కర్లపై సర్వే నిర్వహించారు. వారు ఎంత సేపు నిద్రిస్తారనే విషయంపై దృష్టి సారించి అధ్యయనం చేయగా.. 40శాతం మందికి నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల ప్రభావంతోనే కరోనా సోకినట్లు నిర్థారించారు.