ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారు: కైఫ్

సోమవారం, 7 అక్టోబరు 2019 (11:03 IST)
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం(యూఎన్‌జీఏ)లో ఇమ్రాన్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తప్పుబట్టారు. తాజాగా ఇమ్రాన్‌పై తాజాగా, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా విమర్శలు గుప్పించాడు. 
 
గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కార్ఖానాగా మారిందని ఆరోపించాడు. 
 
ఉగ్రవాదుల విషయంలో పాక్ తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని కైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు