కాగా ఐరాసలో ఇమ్రాన్ ప్రసంగంపై ఇప్పటికే క్రికెటర్లు హర్భజన్‌సింగ్, మహ్మద్ షమి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మరో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనదైన శైలిలో ఇమ్రాన్‌పై సెటైర్లు వేశాడు. చైనాలో మౌలిక సదుపాయాలను ఇమ్రాన్ మెచ్చుకొంటూ.. అమెరికాలో చిన్నకార్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయని ఓ చానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
సెహ్వాగ్ వ్యాఖ్యలకు మరో క్రికెటర్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్ ఈయన కాదన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ప్రసంగం పేలవంగా ఉందని, శాంతి కోరుకోవాల్సిన దేశం తీరు ఇలా ఉండకూదని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మరికొందరు క్రికెటర్లు కూడా ఘాటుగానే స్పందించారు.