భారత క్రికెటర్లలో ఎవరెవరికీ సొంత విమానాలు ఉన్నాయి?

ఠాగూర్

సోమవారం, 23 డిశెంబరు 2024 (16:30 IST)
ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. క్రికెట్‌తో పాటు బాహ్య ప్రపంచంలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ప్రకటనకర్తలు యాడ్స్ కోసం వారి వెంటపడుతుంటారు. కోట్లకు కోట్లు గుమ్మరిస్తుంటారు. ఇలా కొందరు క్రికెటర్లు వందల కోట్లాద రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొందరు క్రికెటర్లు తమ సంపాదనను రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ వంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు లగ్జరీ జీవితాన్ని అనుభవించేందుకు ఇష్టపడుతుంటారు. ఇలాంటివారిలో కొందరు సొంతంగా ప్రైవేట్ జెట్స్‌ను కలిగివున్నారు. 
 
జాతీయ మీడియా కథనాల ప్రకారం... భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లో స్థానమేంటో అందరికీ తెలిసిందే. ఆయనకు సొంతంగా ప్రైవేట్ జెట్‌ను కలిగివున్నాడు. సకల సదుపాయాలతో ఉన్న ఈ విమానంలో ఫ్యామిలీతో కలసి అపుడపుడూ ట్రిప్పులకు వెళ్లి వస్తుంటారు. 
 
ఎంఎస్ ధోనీ.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన మేటి క్రికెటర్. ఆయనకు ప్రైవేట్ జెట్ ఉందని జాతీయ మీడియా చెబుతోంది.
 
హర్యానా హరికేన్ కపిల్ దేవ్... దేశానికి తొలి ఐసీసీ వరల్డ్ కప్‌ను అందించిన లెజెండరీ క్రికెటర్. ఆయనకూ ప్రైవేట్ జెట్ ఉందట.
 
హార్డిక్ పాండ్యా... భారత క్రికెట్ అభిమానుల్లో హార్థిక్ పాండ్యా పేరు విననివారెవరూ ఉండరు. ఒక దశలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్న పాండ్యాకూ సొంతంగా జెట్ విమానం ఉందని జాతీయ మీడియా చెబుతోంది.
 
సచిన్ టెండూల్కర్... క్రికెట్ దేవుడిగా పేరు పొందిన అసాధారణ క్రికెటర్. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచస్థాయిలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ధనిక క్రికెటర్లలోనూ ఒకరైన సచిన్‌కు సొంతంగా విమానం ఉందట.
 
వీళ్లు మాత్రమే కాకుండా... ఇంకా మరికొందరు క్రికెటర్లకు కూడా ప్రైవేటు జెట్ విమానాలు ఉన్నాయి. అయితే వారి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందని జాతీయ మీడియా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు