జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి ట్వంటీ-20లో షాక్ తగిలింది. వన్డే సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్న భారత జట్టుకు జింబాబ్వే ఆటగాళ్లు తొలి ట్వంటీ-20లో చుక్కలు చూపించారు. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధోనీసేన తడబడటంతో జింబాబ్వే విజయకేతనం ఎగురవేసింది. నిర్ణీత 20 ఓవర్ల ధోనీసేన 168 పరుగులే సాధించి రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయానికి చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరమవగా, పేసర్ నెవిల్ మద్జివా ఐదు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. అనుభవం లేని మద్జీవా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోవడం ద్వారా మ్యాచ్‌కు ముగింపు ఇవ్వలేకపోయాడు. భారత జట్టులో మనీశ్‌పాండే(35 బంతుల్లో 48), మన్‌దీప్‌సింగ్(27 బంతుల్లో 31,) రాణించగా, ధోనీ(19 నాటౌట్), జాదవ్(19), రాయుడు(19), అక్షర్(18) పర్వాలేదనిపించారు.