భారత జట్టు క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో భారత షటిల్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకి మధ్య అఫైర్ ఉన్నట్లు గత కొంతకాలం క్రితం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పుకార్లు బాగా షికార్లు కొట్టాయి. కేరీర్ మంచి ఊపుమీద గుత్తా షట్లర్ చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. ఆ తరువాత కొన్నిమనస్పర్థల కారణం చేత వీరిద్దరు విడిపోయారు. విడాకుల అనంతరం ఆమె ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజాహారుద్దిన్‌తో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు వినిపించాయి.
ఈ విషయం వల్ల క్రీడా లోకంలో పెనుదుమారం లేపింది. కాగా తాజాగా.. సూరత్‌లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించేందుకు వెళ్ళగా.. గుత్తా జ్వాలపై మీడియా అదే ప్రశ్నను అడిగింది. దీనితో అజారుద్దీన్‌తో అఫైర్‌పై గుత్తా జ్వాల మరోసారి ఘాటుగా సమాధానమిచ్చింది. అజర్‌తో అఫైర్‌ను ప్రశ్నించడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది.