ప్రస్తుతం అహ్మదాబాద్ లోని కోర్ట్ యార్డ్ బై మారియట్ హోటల్ కూడా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ని వారికి ప్రీతిపాత్రమైన భోజనంతో కలిపి ఐదు అడుగుల థాలీని సిద్ధం చేసింది. ఈ అతి పెద్ద థాలీకి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పిలిచే మొతేరా స్టేడియం పేరు పెట్టడం కూడా విశేషం.
క్రికెట్ రాస్ లో భాగంగా ఈ థాలీ మెనూ కూడా క్రికెట్ థీమ్ తోనే ఏర్పాటు చేయడం విశేషం. వంటకాలకు కూడా ఆటగాళ్ల పేర్లను పెట్టారు. కొహ్లీ ఖమన్, పాండ్యా పాత్రా, ధోనీ కిచిడీ, భువనేశ్వర్ భర్తా, రోహిత్ ఆలూ రసీలా, శార్దూల్ శ్రీఖండ్, బుమ్రా భిండీ శిమ్లా మిర్చ్, హర్బజన్ హాండ్వీ లతో పాటు బౌన్సర్ బాసుందీ, హాట్రిక్ గుజరాతీ దాల్ లాంటి మరెన్నో క్రికెట్ థీమ్ వంటకాలను ఈ థాలీలో చేర్చారు.
ఒక్కో థాలీలో నాలుగైదు బౌల్స్ లో ఒక్కో వంటకాన్ని సర్వ్ చేయడం విశేషం. వీటితో పాటు స్నాక్స్, రకరకాల రోటీలు, స్టార్టర్స్, డ్రింక్స్, డెజర్ట్స్ ఈ థాలీలో ఉన్నాయి.