ఐసీసీ 2023 వరల్డ్ కప్ : మీ ఒక్కరి కోసం వేదికను మార్చలేం...

గురువారం, 30 మార్చి 2023 (16:21 IST)
ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని పాకిస్థాన్ పట్టుబడుతున్నట్టు సమాచారం. దీనికి ఐసీసీ నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. అదేసమయంలో ఐసీసీ 2023 వరల్డ్ కప్ టోర్నీని భారత్, బంగ్లాదేశ్‌‍లు ఆతిథ్యమివ్వనున్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో పాకిస్థాన్ విజ్ఞప్తిని ఐసీసీ నిర్వాహకులు తోసిపుచ్చినట్టు సమాచారం. అదేసమయంలో వేదిక మార్పుపై ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై దృష్టిసారిస్తామని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, అక్టోబరు 5వ తేదీ నుంచి ఈ ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 12 నగరాలు ఆతిథ్యమిస్తాయి. ప్రతి స్టేడియంలో నాలుగు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. వీటిలో అత్యంత ప్రేక్షకాధారణ కలిగిన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను మాత్రం ఢిల్లీ లేదా చెన్నైలో నిర్వహించాలని భావిస్తుంది. దీనిపై ఓ క్లారిటీ రావాల్సివుంది. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం అహ్మదాబాద్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు