బాలీవుడ్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ జంట ఎక్కడ కనిపించినా అది పెద్ద న్యూస్ అయిపోతోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను వీరిద్దరూ డెహ్రాడూన్‌లో జరుపుకున్నారు. దీంతో, వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. చిరకు అలాంటిదేం లేదంటూ కోహ్లీ స్వయంగా వివరణ ఇచ్చాడు.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో బుధవారం వీరిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. '1973 వర్లీ' పేరుతో ఓంకార్ బిల్డర్స్ అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను ఈ జంట పరిశీలించింది. దీంతో, ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తి కాగానే... ఈ జంట ఇందులోకి మకాం మార్చేయనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకా పెళ్లైన తర్వాత ఇక్కడే ఈ జంట కాపురం మొదలెడతారని వార్తలు వస్తున్నాయి. కానీ వదంతులపై ఈ జంట ఇంకా నోరెత్తలేదు.