పింక్-బాల్ టెస్ట్‌లలో ఆస్ట్రేలియా అద్భుత రికార్డును సొంతం చేసుకుంది. ఆదివారం నాడు భారత్‌పై పూర్తిగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయింది.