ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ యువ బ్యాటర్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి అర్ధసెంచరీ.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై విజృంభించాడు. స్టార్ పేసర్ కగిసో రబడా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బాదిన సిక్సర్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 4, శామ్ కరన్ 2, హర్షల్ పటేల్ 2, రబాడా 1 వికెట్ తీశారు.