ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హేస్టింగ్స్ రక్తం వాంతులు చేసుకున్నాడు. అతను రక్తం వాంతులు చేసుకునేంత అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. దీంతో హేస్టింగ్స్ క్రీడా జీవితం ప్రమాదంలో పడింది. ఊపిరితిత్తుల్లో తలెత్తిన సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండటంతో ఆయన కెరీర్ డైలమాలో పడింది.
ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి దగ్గినప్పుడు.. అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు నిర్ధారించట్లేదు. వారి మౌనం తనలో భయాన్ని పెంచుతోంది. ఇకపై తాను బౌలింగ్ చేస్తానో లేదోనని హేస్టింగ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బౌలింగ్ చేసే ప్రతీసారి రక్తపు వాంతి చేసుకుంటున్నానని వాపోయాడు.