విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

బుధవారం, 11 అక్టోబరు 2017 (10:04 IST)
మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన గౌహతి నగర వాసులు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణించిన బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ రాళ్ళదాడి కలకలం రేపింది. పైగా, రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కొన్న రాళ్లదాడి ఘటనల్లో ఇది రెండోది. 
 
సెప్టెంబరులో చిట్టగ్యాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఓ టెస్టు మ్యాచ్ అనంతరం వెళుతున్నప్పుడూ ఇలాగే రాళ్లు విసిరారు. "ఓ బలమైన రాయి వచ్చి మా బస్సు అద్దాన్ని పగులగొట్టింది. చాలా భయం వేసింది" అని ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ పగిలిన అద్దం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఘటన తర్వాత, మరింత రక్షణ మధ్య ఆటగాళ్లను తరలించారు. ఆపై రాష్ట్ర మంత్రి హేమంత్ విశ్వ శర్మ స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టుపై రాళ్లదాడికి చింతిస్తున్నట్టు తెలిపారు. 
 
దీనిపైనే రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ స్పందిస్తూ, ఇది భద్రతాపరమైన లోపం ఎంతమాత్రమూ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామని, ఆటగాళ్లకు భద్రతకు కల్పించడం తమ కర్తవ్యమని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఓ క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి అద్దాన్ని తాకిందని 'క్రికెట్ ఆస్ట్రేలియా' తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

 

Pretty scary having a rock thrown through the team bus window on the way back to the hotel!! pic.twitter.com/LBBrksaDXI

— Aaron Finch (@AaronFinch5) October 10, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు