సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, గుట్టల్లో, నేల నుండి ఇవి పైకి పొడుచుకువస్తాయి. సహజసిద్ధంగా పెరిగే పుట్టగొడుగులు తెలుపు రంగులో ఉంటాయి. వీటిని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది పూర్తిగా శాఖాహారం.
* రక్తపుపోటు అదుపులో ఉంటుంది.
* ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది.