వాట్సాప్ గేమ్ కోసం.. అమ్మాయి ఇష్టప్రకారమే ఆమెతో కలిశాను.. అలెక్స్

బుధవారం, 9 జనవరి 2019 (11:07 IST)
ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ అలెక్స్ హెప్‌బర్న్‌పై అత్యాచార ఆరోపణలు నమోదైనాయి. అలెక్స్ హెప్ బర్న్.. తన స్నేహితుడు జో క్లార్క్‌తో కలిసి ఓ యువతిని అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని వార్చస్టెర్ షైర్ కౌంటీ క్లబ్ కు ఆడుతున్న హెప్ బర్న్ ఓ వాట్సాప్ గేమ్‌లో గెలవాలనే కసితోనే ఓ నిద్రిస్తున్న అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో తాను అలెక్స్ గదికి వెళ్లాల్సి వచ్చిందని.. ఆ సమయంలో అలెక్స్‌ తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. కానీ హెప్‌బర్న్ మాత్రం.. ఆ సమయంలో యువతి నిద్రపోలేదని.. ఆమె అంగీకారంతోనే ఆమెతో కలిశానని చెప్తున్నాడు. 
 
కాగా.. వాట్సాప్ గేమ్‌ నిబంధనల ప్రకారం.. గ్రూప్‌లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలను కలిశారో.. ఎప్పటికప్పుడు వివరాలను పోస్టు చేయాలి. నియమించిన సమయం తర్వాత.. ఎవరు ఎక్కువసార్లు సెక్సులో పాల్గొంటే వారే విజేతలుగా నిలుస్తారు. ఈ గేమ్‌లో గెలవాలనే ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని.. బాధితురాలి తరపున వాదించనున్న న్యాయవాది మిరండా మూరె చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు