వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సారాయ్ కలాన్ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు లోకేష్ ఈ నెల అంటే జూలై 19వ తేదీన అదృశ్యమయ్యాడు. పోలీసులు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో పాడుబడ్డ ఇంట్లో బాలుడు లోకేష్ డెడ్ బాడీ దొరికింది. ఆ బాలుడి శరీరం నిండా సూదులు గుచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.