యుద్ధ ప్రాతిపదికన ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ చేపడుతామని, ఇందుకోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని పొంగులేటి చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమి గుర్తింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు పొంగులేటి. ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆగస్టు 15లోపు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ప్రాధన్యత ఇవ్వాలన్నారు.