అతనో క్రికెటర్. పైగా, భారీ కాయుడు. బరువు 153 కేజీలు. కానీ, బ్యాటింగ్‌కు దిగితే సిక్స్‌లు, ఫోర్లను అలవోకగా బాదేస్తుంటాడు. కానీ, క్రీజ్‌లో పరుగెత్తాలంటే మాత్రం మహా చిరాకు. చివరకు క్రీజ్‌లో పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరిన ఆసక్తికర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే... వెస్టిండీస్‌లో కరీబియన్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో శనివారం బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూయిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ జట్టు 195 పరుగులు చేసింది. సెంచరీతో డ్వెన్ బ్రావో కదంతొక్కాడు. దీంతో ఆ జట్టు ప్రత్యర్థి సెయింట్ లూయీస్ జట్టుకు భారీ లక్ష్యం విధించింది.
సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ భారీ కాయుడికి వికెట్ల మధ్య పరుగులు తీయడం కష్టంగా మారింది. దీంతో 18వ ఓవర్ రెండో బంతి సమయంలో కడుపునొప్పి బాధించడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.