ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డిమాండ్ ఉంది. ముంబై పేలుళ్ల అనంతరం దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌లు ప్రపంచ కప్ మ్యాచ్‌లో మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌కు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ భారత్-పాకిస్థాన్‌లు బరిలోకి దిగనున్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడే మ్యాచ్ టిక్కెట్లు దాదాపు అన్నీ అమ్ముడుపోయాయని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. వాటితో పాటు రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌కు విక్రయం పూర్తయిందన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు తర్వాత ప్రత్యర్థులు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పోరుకు గిరాకీ ఉంది. జూన్ 18న ఓవల్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.