వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ గ్రౌండ్లో ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే అతనిలోని రెండో కోణం చాలామందికి తెలియదు. మైదానంలో బ్యాట్‌తో మెరిసే ఈ జమైకా ఆటగాడు.. మైదానంలో బయట మాత్రం నోటి దూలతో ఇబ్బందుల్లో ఇరుక్కుపోతాడు. అంతేకాదు.. సెక్స్ గురించి నోటికొచ్చినట్లు వాగుతాడు. తద్వారా వివాదంలో చిక్కుకుంటాడు. ప్రస్తుతం కూడా క్రిస్ గేల్‌ను మరో వివాదం చుట్టుముట్టింది.
గతంలో "నీ కళ్లు చాలా బాగున్నాయి.. నాతో డేటింగ్‌కు వస్తావా..?" అంటూ ఓ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అభ్యంతరకరంగా మాట్లాడిన క్రిస్ గేల్.. తాజాగా మరోసారి శృంగారపరమైన వ్యాఖ్యలతో వివాదంలో నిలిచాడు. బ్రిటిష్ దినపత్రిక ‘ద టైమ్స్’ మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టును అభ్యంతరకర ప్రశ్నలు అడిగాడట. నువ్వు ముగ్గురితో శృంగారానికి పాల్పడ్డవా? అని ఆ జర్నలిస్టునే వెకిలిగా అడిగాడట. అంతటితో ఆగకుండా ‘నువ్వు ఆ పని చేసి ఉంటావు’ అని కచ్చితంగా చెప్పాడట.