ముంబైలో ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారి ఫొటోలు తీశాడు. తర్వాత ఈ ఫొటోలను లీక్ చేశాడు. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య నగ్న ఫొటోలను ఆమె తండ్రి, సోదరుడికి వాట్సాప్ ద్వారా అతడు పంపాడు. మరోవైపు ఈ విషయం తెలిసిన బాధిత మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వారు తెలిపారు.