తాగిన మైకంలో భర్త పడుకొని ఉండగా భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఆపై భర్త మద్యం మత్తులో చనిపోయాడని డ్రామా చేసింది. అయితే అంజిలప్ప మృతిపై అతని సోదరుడు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో రాధ నిందితురాలని తేలింది. నేరం అంగీకరించడంతో రాధను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.