2015 ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీలో లియాన్నే రసెల్ అనే మసాజ్ థెరపిస్ట్‌తో గేల్ అసభ్యంగా వ్యవహరించాడని ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్, ది కాన్‌బెర్రా టైమ్స్ కథనాలు ప్రచురించాయి. అంటే మసాజ్ సమయంలో క్రిస్ గేల్ తన మర్మాంగాన్ని మహిళా థెరపిస్టుకు చూపించాడన్నది ఆ కథనాల సారాంశం.
కానీ అలాంటి సంఘటనేదీ జరగలేదని క్రిస్ గేల్ వాదించాడు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు నష్టపరిహారం కోరుతూ ఆస్ట్రేలియా పత్రికలపై గేల్ కోర్టులో దావా వేశాడు. ఈ కేసును విచారించిన ఆస్ట్రేలియా కోర్టు క్రిస్‌గేల్‌కు భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాలని సిడ్నీ జ్యూరీ గతేడాది తీర్పు వెలువరించింది. తాజాగా ఒకే విడతలో నగదును చెల్లించాలని మీడియా సంస్థను సుప్రీంకోర్టు జస్టిస్ లూసీ మెక్‌కలమ్ఆ దేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
మహిళా ఫిజియోథెరఫిస్ట్‌కు మర్మాంగాన్ని చూపించాడంటూ గేల్‌పై ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ మీడియా గ్రూపులో వెలువడిన కథనం తప్పని సిడ్నీ జ్యూరీ గతేడాది తీర్పు వెలువరించింది. తాజాగా ఒకే విడతలో నగదును చెల్లించాలని మీడియా సంస్థను సుప్రీం కోర్టు జస్టిస్ లూసీ మెక్‌కలమ్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.