ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు నిలువరించారు. షనాకా 39, అసలంక 38 పరుగులు చేశారు. చివర్లో కరుణరత్నె (43 నాటౌట్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు.
ఇకపోతే, తుది జట్టులో చోటు దక్కించుకున్న పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో భారత్ 263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగింది.