నా ప్రవర్తనతో క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చా : డేవిడ్ వార్నర్

శుక్రవారం, 30 మార్చి 2018 (15:54 IST)
'బాల్యం నుంచి క్రికెట్‌ అంటే పడిచచ్చే నేను.. నా ప్రవర్తనతో దానికి చెడ్డపేరు తెచ్చా' అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వాపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకుగాను డేవిడ్ వార్నర్‌తో పాటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక యేడాది నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై డేవిడ్ వార్నర్ స్పందిస్తూ, ట్యాంపరింగ్ ఘటనలో తన పాత్రకు చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని కోరారు. తాను ఎంతో ప్రేమించే క్రికెట్‌పై తన చర్య మాయని మచ్చ అని చెప్పుకొచ్చాడు. 
 
'ఆ ఉదంతంలో నేను వహించిన పాత్రకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. అందుకు క్షమించాలని వేడుకొంటున్నా. మా తప్పిదంతో క్రికెట్‌కు జరిగిన చేటు, అభిమానులకు కలిగిన క్షోభను అర్థం చేసుకోగలను' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తన భవిష్యత్‌ను నిర్ణయించుకొనేందుకు కొంత సమయం అవసరమని ఈ 31 ఏళ్ల ఆసీస్ ఓపెనర్ అన్నారు. త్వరలోనే మీకొక విషయం వెల్లడిస్తా అని అన్నాడు. యేడాది నిషేధంతోపాటు భవిష్యత్‌లో ఆసీస్‌ జట్టు కెప్టెన్సీ పదవికి వార్నర్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా అనర్హుడిగా ప్రకటించిన విషయం విదితమే. 

 

Disgraced Australian cricketer David Warner gives an emotional statement along side his family pic.twitter.com/mEjRrnZgdJ

— Sky News (@SkyNews) March 29, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు