బాల్ ట్యాంపరింగ్‌లో సచినే వున్నాడు.. మీకెందుకు సిగ్గు..?

గురువారం, 29 మార్చి 2018 (12:49 IST)
బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్‌తో చీటింగ్ ఇదేమీ కొత్త కాదని షేన్ వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో సచిన్, మైక్ అథెట్రాన్ వంటి దిగ్గజాలే వున్నారని కామెంట్లు చేశాడు.

అలాంటప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నాడు. స్టీవ్ స్మిత్ తన దృష్టిలో అద్భుత ఆటగాడని.. ఇంకా మంచి మనిషని చెప్పుకొచ్చాడు. 
 
అయితే మ్యాచ్‌లో చాలా తెలివితక్కువపని చేశాడని షేన్ వార్న్ మండిపడ్డాడు. స్మిత్, వార్నర్‌కి విధించిన శిక్ష చాలా దారుణమైందని చెప్పాడు. ఏడాది నిషేదం చాలా పెద్ద శిక్ష అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వివాదం ఒక ఆస్ట్రేలియన్‌‌గా, క్రికెట్ ప్రేమికుడి‌గా తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపాడు. 
 
గత ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేస్తున్న పనులను ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది శిక్ష చాలా ఎక్కువని.. తానైతే వారిని పదవుల నుంచి తప్పించి, ఒక టెస్టు నిషేధంతోపాటు భారీ జరిమానా విధించేవాడినని చెప్పుకొచ్చాడు. బాల్ ట్యాంపరింగ్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష సరైంది కాదని షేన్ వార్న్ తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు