స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టేసిన ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అప్పటి నుంచి టాలీవుడ్ హీరోల డైలాగులు, పాటలతో వీడియోలు చేస్తున్నాడు. డేవిడ్ వార్నర్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన డైలాగులతో ఇన్‌స్టాలో హోరెత్తించాడు వార్నర్.