దినేష్ కార్తీక్.. భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ఒకరు. కీపర్ మహేష్ సింగ్ ధోనీ అందుబాటులో లేనిసమయంలో భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తుంటాడు. అపుడపుడూ బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపిస్తుంటాడు. అయితే, ఆదివారం శ్రీలంక వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా భారత పరువును కాపాడాడు. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాల్సిన భారత జట్టును చివరి బంతిని సిక్స్‌గా మలిచి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
కేవలం 8 బంతుల్లో 29 రన్స్ కొట్టి భారత్‌ను గెలిపించి హీరోగా నిలిచాడు. లెక్కకు స్కోరు తక్కువే అయినప్పటికి… కార్తీక్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో మ్యాచ్‌నే మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 29 నాటౌట్. ఆయన 8 బంతుల్లో 6, 4, 6, 0, 2, 4, 1, 6 కొట్టి దేశానికి చిరస్మరణీయమైన విజయాన్ని సాధించి పెట్టారు. భారత్‌కు ఒంటిచేత్తో నిదహస్ ట్రోఫీని అందించాడు.
ఫలితంగా బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షబ్బీర్ రహమాన్ (50 బంతుల్లో 77; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. యజువేంద్ర చహల్ 3, ఉనాద్కట్ 2 వికెట్లు తీశారు.
ఆ తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (42 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. రూబెల్ హొస్సేన్‌కు 2 వికెట్లు దక్కాయి. దినేశ్ కార్తీక్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'… వాషింగ్టన్ సుందర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.