శ్రీశాంత్ ఆరోపణలు హాస్యాస్పదం.. స్పందించకపోవడమే మంచిది..?

బుధవారం, 23 అక్టోబరు 2019 (18:05 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013లో మాడీ స్పీడ్ స్టర్ శ్రీశాంత్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అతడితో పాటు చండీలా, అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తనపై నిషేధం ఎత్తివేయాలని అతడు న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. 
 
ఇటీవల సుప్రీంకోర్టు అతడిపై నిషేధం తొలిగించడంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ శిక్షను ఏడేళ్లకు కుదించింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టులో అతడి శిక్ష ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ టీమిండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. 
 
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికచేసిన టీమిండియా జట్టులో చోటు దక్కకపోవడానికి దినేష్ కార్తీక్ కారణమని శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై దినేష్ కార్తీక్ స్పందిస్తూ.. క్రికెటర్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా హాస్యాస్పదంగా వుంటుందని కొట్టిపారేశాడు. తనపై శ్రీశాంత్ చేసిన కామెంట్లు విన్నాను. ఈ ఆరోపణలపై స్పందించడం కూడా హాస్యాస్పదంగా ఉంటుందని దినేశ్ తీసిపారేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు