అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన బెన్‌స్టోక్స్

సోమవారం, 18 జులై 2022 (17:52 IST)
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. పరిమితి 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. వన్డే ఫార్మెట్‌లో అత్యుత్తమ సేవలు అందించలేనని అందులో పేర్కొన్నారు. 
 
దీంతో మంగళవారం దక్షిణాఫ్రికాతో ఆడేదే తన చివరి వన్డే అని తెలిపాడు. కాగా, ఇంగ్లాండ్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌స్టోక్స్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అతడు టీమ్‌ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
 
ఇంగ్లండ్ జట్టు తరపున 104 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్ 2019లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
 
తన రిటైర్మెంట్‌పై బెన్ స్టోక్స్ చేసిన ట్వీట్‌లో.. "ఇది చాలా కఠినమైన నిర్ణయం. నా సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. కానీ, ఈ ఫార్మెట్‌లో నా వంద శాతం సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నాననేది వాస్తవం. అందుకే ఈ ఫార్మెట్‌కు స్వస్తి పలకడమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ఆటగాడిగా వంద శాతం కన్నా ప్రదర్శన ఏమాత్రం తగ్గినా వాళ్ళు ఇంగ్లండ్ జట్టు జెర్సీకి అనర్హులు" అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. 


 

❤️

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు