ప్రపంచ కప్ పోటీలు.. 500 పరుగుల మార్క్.. ఇంగ్లండ్‌కే సొంతం.. కోహ్లీ

శుక్రవారం, 24 మే 2019 (15:41 IST)
ప్రపంచ కప్ పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ వూహించినట్లుగా వరల్డ్‌‌కప్‌‌లో అన్నీ హై స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లు ఉండకపోవచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ వన్డేల్లో ఐదు వందల పరుగుల మార్కును ముందుగా అందుకునే సత్తా ఇంగ్లండ్‌‌కే ఉందని కోహ్లీ తెలిపాడు. 
 
గతేడాది ఆస్ట్రేలియా 481/6 రన్స్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ వన్డేల్లో టాప్‌‌ స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. దాంతో, ఈ ఫార్మాట్‌‌లో 500 రన్స్‌‌ సాధ్యమేనా అన్న ప్రశ్నకు విరాట్‌‌ బదులిచ్చాడు. ఈ మేరకు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను చూస్తూ.. ఇది మీపైనే ఆధారపడి వుంటుందని చెప్పాడు. 500 రన్స్‌‌ను అందరికంటే ముందుగానే అందుకోవాలని ఆతృతగా ఉన్నట్టు కనిపిస్తున్నారని తెలిపారు.
 
ఇకపోతే.. ఇంగ్లండ్‌‌లో అడుగుపెట్టిన టీమిండియా అందుకోసం సన్నాహకం మొదలుపెట్టింది. బుధవారమే లండన్‌‌ చేరుకున్న కోహ్లీసేన క్షణం కూడా వృథా చేయకూడదని భావిస్తున్నట్టుంది. అందుకే విశ్రాంతి కూడా తీసుకోకుండా వెంటనే మైదానంలోకి వచ్చింది. గురువారం రెస్ట్‌‌ తీసుకునే వెలుసుబాటు ఉన్నా.. ఆటగాళ్లంతా తొలి ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు