సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే తరహా రూమర్స్ వచ్చినప్పటికీ ఆయన కొట్టిపారేశారు. కానీ, ఈ దఫా మాత్రం సినిమాలకు టాటా చెప్పేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని భావిస్తున్నారు.
ఆ రెండు చిత్రాల తర్వాత అగ్ర నటుడు కమల్ హాసన్ సొంతంగా నిర్మించే ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో కమల్ హాసన్ కూడా నటించనున్నారు. పైగా, ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చినప్పటికీ దర్శకుడు ఎవరన్నది మాత్రం తెలియాల్సివుంది. అయితే, కమల్‌తో నటించే చిత్రమే రజనీకాంత్ కెరీర్‌లో చివరి చిత్రం అవుతుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.