Ram Charan - Bujji Babu, Ratnavel
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ కేరళలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పాటకోసం చిత్ర టీమ్ వెళ్ళినట్లు ప్రకటించారు. జానీ మాస్టర్ సారధ్యంలో చక్కటి ప్రక్రుతి అందాలను బందిస్తున్నారు. అందుకు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ తన కెమెరాకు పనిచెబుతున్నారు. ఈ దశలో రైల్వే టెనల్ దగ్గర షూట్ ఏరియాను పరిశీలిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దర్శకుడు బుజ్జిబాబు కూడా వున్నారు.