భద్రత ముఖ్యంగా.. మరణించాలని రాసిపెట్టివుంటే.. ఎలాగైనా చనిపోతారు.. మియాందాద్

గురువారం, 13 ఏప్రియల్ 2023 (15:16 IST)
ఈ యేడాది ఆసియా క్రికెట్ కప్ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ వెళ్లరాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. దీనిపై పాకిస్థాన్ లెజెండ్ క్రికెటర్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రత సంగతి పక్కనపెట్టండి.. మరణించాలని రాసివుంటే ఎక్కడైనా.. ఎలాగైనా చనిపోతారంటూ కామెంట్స్ చేశారు. 
 
చావు బతుకులు మన చేతుల్లో లేవన్నారు. ఇపుడు పాకిస్థాన్ జట్టును భారత్ పిలిస్తే మేం వెళ్ళాలి. అలాగే వాళ్ళూ మా దేశానికి రావాలి. నిజానికి చివరిగా మా జట్టే భారత్‌లో పర్యటించింది. అప్పటి నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టలేదు. ఇపుడు వాళ్ల వంతు వచ్చింది. నిర్ణయం వారిదే అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు రాకపోతే భారత్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మియాందాద్‌ గతంలోనే పేర్కొన్నాడు. ఈ సమస్య వచ్చినప్పుడల్లా భారత్‌ను వదిలిపెట్టే అవకాశమే లేదని కూడా హెచ్చరించాడు. కాగా, ఆసియా కప్‌ కోసం పాక్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తే, అక్టోబరు నెలలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్థాన్.. భారత్‌లో రాబోమని మెలికపెడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు