భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం సేవించడమేకాకుండా, వేగంగా కారు నడిపి అపార్ట్‌మెంట్ గేటును ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మరో కారు ఢీకొట్టాడు. దీంతో ఆ కారు బాగా ధ్వంసమైంది. అంతటితో ఆగని వినోద్ కాంబ్లీ అపార్ట్‌మెన్ వాచ్‌మెన్‌తో, ఇతరులతో కూడా గొడవపడ్డాడు.
దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై బాంద్రా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. ఆయనపై ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 279), ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించడం (సెక్షన్ 336), నష్టం కలిగించడం (సెక్షన్ 427) కింద కేసు నమోదు చేశారు. కాగా, అరెస్టు చేసిన కొద్ది సేపటికే వినోద్ కాంబ్లీకి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.