అజారుద్దీన్ ఇంట విషాదం - తండ్రి అజీజుద్దీన్ కన్నుమూత

బుధవారం, 19 అక్టోబరు 2022 (10:14 IST)
భారత మాజీ క్రికెట్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి అజీజుద్దీన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను గురువారం నిర్వహించనున్నారు. 
 
అజీజుద్దీన్ సుధీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుది శ్వాస విడిచారు. అజీజుద్దీన్ మరణంతో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు