భారత్-పాకిస్థాన్‌ల మధ్య దీర్ఘకాలిక సమస్యగా వున్న కాశ్మీర్ సమస్యకు క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిష్కారం చెప్పాడు. కాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రిపబ్లిక్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నౌహట్టాలో సీఆర్పీఎప్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడి చేశారు.
అదేవిధంగా ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించాలని, రాజకీయ మద్దతు ఇస్తే సైనిక దళాలు, సీఆర్పీఎఫ్ సత్తా ఏమిటో, ఫలితాలేమిటో చూపిస్తాయన్నాడు. మరో ట్వీట్‌లో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ఇలా చేయాలన్నాడు.
కాశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓ వారం పాటు ఎలాంటి రక్షణ లేకుండా వారి కుటుంబాలతో నివసించాలన్నాడు. ఆ తర్వాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని, అప్పుడే వారికి సైనిక దళాల బాధలేమిటో, అసలు కాశ్మీర్ అంటే ఏమిటో తెలిసివస్తుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.