ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 51 యేళ్ళ లక్ష్మి తన సొంత రాష్ట్రం ఆంధ్రతో పాటు బీహార్, ఈస్ట్‌జోన్, రైల్వేస్, సౌత్ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. కుడిచేతి బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ మీడియం బౌలింగ్‌తో చిరస్మరణీయ విజయాల్లో కీలకమైంది.
క్రికెటర్‌గానేకాకుండా 2008-09 మహిళల దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలిసారి మ్యాచ్ రిఫరీగా లక్ష్మి బాధ్యతలు నిర్వర్తించింది. దీనికి తోడు మూడు అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు రిఫరీగా విధులు చేపట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ చేత రిఫరీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందనీ, మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.