టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ ప్రేమాయణం బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. ఇటీవలే యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సంగీత్ కార్యక్రమంలో చిందులేసిన ఈ జం హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్న యువరాజ్ దంపతులకు అభినందనలు చెప్పేందుకు వెళ్లింది.
విరాట్ కోహ్లీ నీలి రంగు షేర్వాణీ ధరించగా.. నలుపు, బంగారు రంగులోని ఎథ్నిక్ డ్రస్‌తో అనుష్క చూపరుల మతి పోగొట్టింది. అంతేకాదు.. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో ప్రముఖ బాలీవుడ్ గేయరచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకున్నారు.
అలాగే ఈ ప్రేమపక్షులు సోమవారం రాత్రి జరిగిన ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకకు వచ్చారు. డైరెక్టర్ కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బాలీవుడ్ జంటలు, యువ తారలు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు. విరాట్, అనుష్క నలుపు రంగు దుస్తుల్లో ఆకర్షణగా నిలిచారు.