హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్ట్.. కారణం?

సెల్వి

గురువారం, 11 ఏప్రియల్ 2024 (13:29 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాల స‌వ‌తి సోద‌రుడు వైభ‌వ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్ల వ‌ద్ద 4.3 కోట్ల చీటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు వైభ‌వ్‌పై ఫిర్యాదు న‌మోదు అయ్యింది.

2021లో హార్దిక్‌, కృణాల్‌, వైభ‌వ్‌లు క‌లిసి ఓ వ్యాపారం మొద‌లుపెట్టారు. ఆ ఒప్పందం ప్ర‌కారం హార్దిక్‌, కృణాల్ పాండ్యాలకు 40 శాతం ప్రాఫిట్ వెళ్తుంది. 
 
ఇక వైభ‌వ్‌కు 20 శాతం మాత్ర‌మే ద‌క్కుతుంది. వైభ‌వ్ పాండ్యా కొత్త‌గా ఓ వ్యాపారం మొద‌లుపెట్టి, ఆ గ్రూపున‌కు ఫండ్స్‌ను త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై హార్దిక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైభవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు