నా మొగుడు పాకిస్థాన్ మొనగాడు... క్రికెటర్ అమిర్ భార్య నర్గీస్

గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
ఇటీవల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ పేర్ మహ్మద్ అమిర్‌పై అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. కేవలం 27 యేళ్ళ వయసులోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అతని నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు బాహాటంగానే విమర్శించారు. ఇంకొందరు క్రికెటర్లు ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అమిర్‌ది తొందరపాటు నిర్ణయమని కొందరంటే.. మరికొందరు మాత్రం అమిర్ ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడనే వార్తలు గుప్పుమన్నారు. 
 
వీటన్నింటిపై అతని భార్య నర్గీస్ మాలిక్ స్పందించారు. 'నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా' అంటూ ఎదురుదాడికి దిగారు. 'పాకిస్థాన్‌ క్రికెటర్‌గా అమిర్‌ ఎంతో గర్విస్తాడు. అతని నిజాయితీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. అమిర్‌ టెస్టు రిటైర్మెంట్‌పై ఎవ్వరికీ సమాధానం చెప్పాల్పిన పనిలేదు. ప్రజలంతా అమిర్‌కు మద్దతుగా ఉన్నారు. ఇంగ్లండ్‌కు ఆడాల్సిన అవసరం అమిర్‌కు లేదు. 
 
పాకిస్థాన్‌కు తప్ప మరే దేశానికి అమిర్‌ ప్రాతినిథ్యం వహించడు. పాకిస్థాన్‌ తరపున క్రికెట్‌ ఆడటాన్ని అమిర్‌ ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఒకవేళ మా కూతురు క్రికెట్‌ ఆడాలనుకుంటే పాక్‌కే ఆడుతుంది కానీ ఇంగ్లండ్‌కు కాదు. అమిర్‌ రిటైర్‌ అయ్యింది కేవలం టెస్టు క్రికెట్‌ నుంచే కానీ ఓవరాల్‌ క్రికెట్‌ నుంచి కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. వన్డేలు, టీ20ల్లో దేశం గర్వించేలా అమిర్‌ ఆడతాడు' అంటూ బ్రిటీష్‌ సంతతికి చెందిన నర్గీస్‌ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు