అనంతపురం జిల్లాలో బాలిక దారుణంగా మృతి చెందింది. స్కూల్‌లో వేడిపాల పాత్రలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.