కడపలో భారీ స్థాయిలో నకిలీ జెఎస్‌డబ్ల్యు సిల్వర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఐవీఆర్

గురువారం, 25 సెప్టెంబరు 2025 (22:59 IST)
తమ బ్రాండెడ్ ఉత్పత్తులకు నకలు చేసి అసలైన ఉత్పత్తులుగా మార్కెట్లలో విక్రయిస్తోన్న వారిపై తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగంగా, జెఎస్‌డబ్ల్యు స్టీల్ కోటెడ్ బృందం, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో నకిలీ జెఎస్‌డబ్ల్యు సిల్వర్ ముద్రణ వేసిన రోలింగ్ షట్టర్ ఉత్పత్తుల నిల్వను వెలికితీసి స్వాధీనం చేసుకుంది.
 
ఈ చర్య నకిలీ ఉత్పత్తుల పట్ల కంపెనీ యొక్క జీరో-టాలరెన్స్ విధానాన్ని, మోసపూరిత పద్ధతుల నుండి కస్టమర్లు, ఛానెల్ భాగస్వాములు, బ్రాండ్ ఖ్యాతిని రక్షించడానికి దాని నిరంతర ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఒక నిర్దిష్ట సమాచారం ఆధారంగా వేగంగా చర్య తీసుకొన్న, జెఎస్‌డబ్ల్యు స్టీల్ కోటెడ్ బృందం షట్టర్ ఉత్పత్తులపై దాని ట్రేడ్‌మార్క్ చేయబడిన జెఎస్‌డబ్ల్యు సిల్వర్ గుర్తు దుర్వినియోగాన్నిధృవీకరించడానికి తృతీయ పక్ష ఏజెన్సీ ద్వారా వివరణాత్మక దర్యాప్తు నిర్వహించింది. ఇది కడపలోని ఎస్డిఎస్ సన్స్‌ భాగోతాన్ని బయటపెట్టింది. 
 
ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు స్పష్టమైన ఆధారాలను కనుగొనడంతో, జెఎస్‌డబ్ల్యు స్టీల్ అనుబంధ సంస్థ- జెఎస్‌డబ్ల్యు స్టీల్ కోటెడ్ 24 గంటలూ నిఘా నిర్వహించింది. తమకు సమాచారం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించింది. దీని ఫలితంగా ఎస్ డి ఎస్& సన్స్‌ పై విజయవంతమైన రీతిలో పోలీసు దాడి జరిగింది, ఫలితంగా జెఎస్‌డబ్ల్యు సిల్వర్ మార్క్ తో చట్టవిరుద్ధంగా గుర్తించబడిన 18 షట్టర్ భాగాలను మరియు ముద్రణ  కోసం ఉపయోగించే సంబంధిత అచ్చును స్వాధీనం చేసుకున్నారు.
 
ఐపీసీ  సెక్షన్లు 417, 420, 482, 483, 485, మరియు 486 మరియు ట్రేడ్‌మార్క్‌ల చట్టంలోని సెక్షన్లు 102, 103, 104, మరియు 107 కింద ఎస్ డి ఎస్& సన్స్ యజమానిపై కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో 2025 సెప్టెంబర్ 12న ప్రథమ సమాచార నివేదిక (FIR నం. 323/2025) దాఖలు చేయబడింది.తమ బ్రాండ్ సమగ్రతను కాపాడుకోవడానికి, కస్టమర్‌లు నిజమైన జెఎస్‌డబ్ల్యు ఉత్పత్తులను మాత్రమే పొందేలా చూసుకోవడానికి తమ నిబద్ధతను జెఎస్‌డబ్ల్యు స్టీల్ పునరుద్ఘాటిస్తుంది. నకిలీని ఎదుర్కోవడానికి మరియు దాని నాణ్యత , విశ్వసనీయ ప్రమాణాలను నిలబెట్టడానికి కంపెనీ పోలీస్ అధికారులతో కలిసి పనిచేస్తూనే ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు