ప్రపంచం మొత్తానికి బ్యాటింగ్ పాఠాలు చెప్పే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ హోటల్ వెయిటర్ సలహాను పాటించి తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నానని తెలిపాడు. ఎంత చిన్నవారైనా వారి సలహాను స్వీకరించగలిగితే మనం మరింత మెరుగవుతామన్నాడు. ఒక్కసారి తాను చెన్నైలోని ఓ హోటల్లో భోజనం చేస్తున్నాను. ఆ హోటల్లోని వెయిటర్ నా దగ్గరకి వచ్చి మీరేం అనుకోనంటే ఓ విషయం చెబుతానన్నాడు. నేను చెప్పమన్నాను.
‘మీ మోచేతి గార్డ్ వల్ల మీ బ్యాట్ సైట్రకింగ్ దెబ్బతింటోంది. మోచేతి గార్డ్‌ను మార్చుకుంటే మంచిది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా తనకు వందశాతం నిజమనిపించింది. వెంటనే అతను చెప్పిన నా మోచేతి గార్డును మార్చుకున్నాను. మన దేశంలో పాన్‌షాప్ నడిపే వ్యక్తి నుంచి ఓ కంపెనీ సీయీవో వరకు అందరూ సలహాలు ఇస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంతే’ అని సచిన్ చెప్పుకొచ్చాడు.