దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మొదటి వికెట్‌కు 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 18 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న రోహిత్... ఓ సిక్సర్, ఒక ఫోర్ సాయంతో 18 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.
భువీకి కూడా స్థానం కల్పిస్తారని, భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగుతుందని మ్యాచ్ ముందు ప్రచారం జరిగినా, స్పిన్ ఆడడంలో విండీస్ తడబడుతుందన్న నేపథ్యంలో కోహ్లీ ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లకే ఓటేశాడు. దాంతో, చహల్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలు నిలుపుకున్నారు. అలాగే, వెస్టిండీస్ జట్టు రెండు మార్పులు చేసింది.
జట్టు వివరాలు
భారత్ : రాహుల్, రోహిత్, కోహ్లీ, శంకర్, జాదవ్, ధోనీ, పాండ్యా, షమీ, కుల్దీప్, చాహల్, బుమ్ర.
వెస్టిండీస్ : గేల్, అంబ్రీస్, హోప్, పూరన్, హెట్మియర్, హోల్డర్, బ్రాత్‌వైట్, అలెన్, రోచ్, కోట్రెల్, థామస్.