దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా బుధవారం భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగారు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ చెప్పాడు.
అలాగే చిన్నగాయం కారణంగా వరుణ్ చక్రవర్తి తప్పుకున్నాడని, అతని స్థానంలో అశ్విన్ జట్టులో చేరాడని వెల్లడించాడు. అలాగే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు మాజీ సారధి అష్రాఫ్ ఆఫ్ఘన్ రిటైరయిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో షరాఫుద్దీన్ ఆడనున్నాడు.
ఆ తర్వాత ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు కుదురుగా ఆడుతున్నారు. వీరిద్దరూ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేశారు. ఇందులో రోహిత్ శర్మ 20, రాహుల్ 17 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ భారత్‌కు అగ్నిపరీక్షలా ఉన్న విషయం తెల్సిందే.
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా
ఆఫ్ఘనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్ షెహజాద్, రహ్మనుల్లా గుర్బాజ్, నజిబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రాఫ్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్.