ఇక అసలు విషయానికొస్తే, ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్‌మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్‌తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు.
కాగా, ఈ మెగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు బ్రిటన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. ఈ టోర్నీ కోసం భారత్ కూడా మెరికల్లాంటి క్రికెటర్లతో కూడా జట్టును ప్రకటించిన విషయం తెల్సిందే.