కాంగ్రెస్ తీరు... హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది : హరీష్ రావు

ఠాగూర్

బుధవారం, 24 సెప్టెంబరు 2025 (13:57 IST)
భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక మాట... రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో మాటగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
'అవగాహన లేని సీఎం, నీళ్ల మంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. సమ్మక్క సాగర్‌ పూర్తి చేసింది భారత రాష్ట్ర సమితి.. ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్‌. ఏపీ సీఎం చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం వహించారు. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ఎత్తు పెంపుపైనా మౌనం వహిస్తున్నారు. రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాల కంటే, పొరుగు రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువా?' అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 
 
తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధికి, నిజాయితీని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. కృష్ణాలో 299 -512 వాటా ఇచ్చి తెలంగాణాకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. గత 2013లో జస్టిస్ శ్రీకృష్ణ కమటి రిపోర్టు ఇచ్చిందని, ఇదే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణాకు కృష్ణాలో 299, ఏపీకి 515 టీఎంసీల నీటిని ఇచ్చిన అని అందులో క్లియర్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు