UP: హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు.. విచారణకు పిలిస్తే విద్యాధికారిని బెల్టుతో కొట్టాడు (video)

సెల్వి

బుధవారం, 24 సెప్టెంబరు 2025 (13:36 IST)
Headmaster
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. విచారణకు పిలిచిన విద్యాధికారిని బెల్టుతోనే కొట్టాడు హెడ్ మాస్టర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు రావడంతో విచారణకు పిలిచి, ప్రశ్నలు అడిగిన విద్యాధికారిపై హెడ్ మాస్టర్ రెచ్చి పోయి బెల్టుతో దాడి చేశాడు. ఈ ఘటనతో హెడ్ మాస్టర్ సస్పెండ్ అయ్యాడు. ఇంకా అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహ్మదాబాద్, నద్వా ప్రాథమిక పాఠశాలలో బిజేంద్ర కుమార్ వర్మ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే తనను వేధిస్తున్నాడంటూ అదే స్కూలులో పనిచేస్తున్న అసిస్టెంట్ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంపై విచారణకు రమ్మంటూ బిజేంద్ర కుమార్ వర్మకు విద్యాధికారి అఖిలేశ్ ప్రతాప్ సింగ్ నోటీసులు జారీ చేశారు. వేధింపుల ఘటనపై విచారిస్తున్న క్రమంలో బిజేంద్ర కుమార్ వర్మ రెచ్చిపోయి.. తన బెల్ట్‌ తీసి అఖిలేశ్ ప్రతాప్ సింగ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనతో బిజేంద్రపై పోలీసు కేసు నమోదు చేశారు.

విద్యాధికారిని బెల్ట్‌తో కొట్టిన హెడ్ మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలో ఘటన

గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ బిజేంద్ర వర్మ తనను వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ టీచర్ ఫిర్యాదు

ఈ ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని బిజేంద్ర వర్మకు బేసిక్‌ శిక్షాధికారి(BSA) నోటీసులు… pic.twitter.com/4ha7re0cBq

— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు