వైజాగ్ టెస్ట్ మ్యాచ్ : యశస్వి జైస్వాల్ సెంచరీ... భారత్ స్కోరు 336/6

వరుణ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (20:12 IST)
వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. 256 బంతులను ఎదుర్కొన్న జైస్వాల్ 179 పరుగులతో రాణించాడు. ఫలితంగా భారత్ తన తొలి రోజు ఆటను ముగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ చేసిన స్కోరులో 17 ఫోర్లు, ఐదు సిక్స్‌లు ఉన్నాయి. 
 
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు సంచలన విజయం సాధించిన విషయం తెల్సిందే. శుక్రవారం నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్ (176 నాటౌట్), రోహిత్ శర్మ 14, గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27, పటీదార్ 32, అక్సర్ పటేల్ 27, శ్రీకర్ భరత్ 17 చొప్పున పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో జైస్వామ, అశ్విన్ (5)లు క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్‌తోపాటు రెహాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (14) వికెట్‌తో బషీర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఖాతా తెరవడం విశేషం. సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్, స్పిన్నర్ టామ్ హార్ట్లీ చెరో వికెట్ తీశారు. 
 
కాగా, ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి క్రీజ్లో కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోలేదు. రోహితో కలిసి తొలి వికెట్కు 40 పరుగులు జోడించాడు. గిల్ (34)తో రెండో వికెట్‌కు 49, శ్రేయాస్ అయ్యర్ (27)తో మూడో వికెట్‌కు 90, అరంగేట్ర బ్యాటర్ రజత్ పటీదార్ (32)తో నాలుగో వికెట్‌కు 70, అక్షర్ పటేల్ (27) ఐదో వికెట్‌కు 52 పరుగులు చొప్పున జోడించాడు. 
 
స్పిన్నర్లు, పేసర్ ఎంత ఇబ్బంది పెట్టినా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారీ సిక్స్ సెంచరీ సాధించడం విశేషం. 151 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న జైస్వాల్ ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించాడు. తొలి రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా.. లోకల్ బాయ్ శ్రీకర్ భరత్ (17)ను రెహాన్ బోల్తా కొట్టించాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని కట్ చేసేందుకు యత్నించి బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద బషీర్కు చిక్కాడు. దీంతో భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు